Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో మొదటి అంతర్జాతీయ ఆన్లైన్ ఈ కటా చాంఫియన్‌షిప్- 2021 నిర్వహించారు.ఈ చాంపియన్‌షిప్ పోటీలకు 25 దేశాలనుండి 3000 మందికిపైగా పాల్గొన్నారు. ఇండియా నుండి అది మన నల్లగొండలోని షావోలిన్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ ఇండియా, షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా వ్యవస్థాపకులు నాంపల్లి కనకారావు బ్లాక్ బెల్ట్ 6 డాన్ విద్యార్థులు కన్నెకంటి దుర్గాప్రసాద్, ఏరుకొండ శేఖర్, బాలుర విభాగంలో, బుర్రి ప్రవళిక, బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన బంగారు పతకాలు సాధించారు. విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా వీరికి గోల్డ్‌మెడల్స్, సర్టిఫికెట్లు అందించి అభినందించారు.మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలన్నారు.పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో బంగారుపతకాలు కైవసం చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు అభినందించారు.విశ్వకర్మ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పర్వతం అశోక్, గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు అభినందించారు.ఈ సందర్భంగా షావోలిన్ వ్యవస్థాపకుడు నాంపల్లి కనకారావు మాట్లాడుతూ మన నల్లగొండ పేరు అంతర్జాతీయ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గుర్తింపు తెచ్చినందుకు హదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మున్ముందు మరిన్ని విజయ శిఖరాలను అందుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఒగ్గుమౌళి భార్గవ్, హజ్మత్అలీ, బుర్రి వెంకటేశ్వర్లు, పొట్ట బొంగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.