Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట: దేశ ఆధునిక వైతాళికుడు మహాత్మ జ్యోతి రావు పూలే అని వైస్.ఎం.పి.పి. నాగటి ఉపేందర్, స్వేరో సర్కిల్ జిల్లా నాయకులు నోముల యాదగిరి అన్నారు. ఆదివారం మండలంలోని నీర్నేముల గ్రామంలో మహత్మ జ్యోతి రావు పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల రమేష్, స్వామి, లింగస్వామి, యాధయ్య, రవీందర్, శ్రీకాంత్, సుర్వి నవీన్, మత్యగిరి, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని కక్కిరేణి గ్రామంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి మాతదేవోభవ పితదేవోభవ వ్యవస్థాపక అధ్యక్షులు కుర్మెటి నవీన్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజర్ వేముల సైదులు, బుర్ర నగేష్, వేముల వెంకన్న, బెక్కంటి రమేష్ పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పి నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్ హాజరై నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీడీవో నాగిరెడ్డి, ఎంపీవో అనురాధ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య,ఎంపీటీసీలు, సర్పంచ్, సిబ్బంది పాల్గొన్నారు.జ్యోతిరావుపూలే విగ్రహానికి సీఐటీయూ నగర కన్వీనర్ మాయ క్రిష్ణ,. వ్యవసాయకార్మిక సంఘం జిల్లాకమిటి సభ్యులు బందెల ఎల్లయ్య , కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల క్రిష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాదక్షులు దండు గిరి పాల్గొన్నారు.
రాజాపేట : మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే 194వ జయంతి వేడుకలను కమిటీ అధ్యక్షుడు గుర్రం పాండు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాండు, గౌరవ అధ్యక్షులు ఎర్ర గోకుల.జశ్వంత్, రంగొల్ల శ్రీను, ఉపాధ్యక్షులు కొమ్ము ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఇంజ మహేష్ , కోశాధికారి పెద్దొల సమ్మయ్య, అధికార ప్రతినిధి ఎఱ్ఱగోకుల నాగార్జున కొమ్ము వేణు ,మరి అఖిలపక్ష నాయకులు ఉట్కూరి .అశోక్ గౌడ్,నేమిల మహేందర్ పాల్గొన్నారు. పాముకుంట గ్రామంలో జై భీమ్ ఆదర్శ యూత్ అసోసియేషన్ అధ్వర్యంలో జ్యోతిరావుబాపూలే జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశోక్, దినకర్, అనిల్, మహేందర్, బాలరాజు, ప్రకాష్, గుంశాల్, రాములు, శేఖర్ పాల్గొన్నారు.
భువనగిరి : బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ,అట్టడుగు వర్గాల సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహా వ్యక్తి జ్యోతిబా పూలే అని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కష్ణ కేవీపీఎస్, జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కష్ణ తెలిపారు. ఆదివారం జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లాకమిటి సభ్యులు బందెల ఎల్లయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాదక్షులు దండు గిరి పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే విగ్రహానికి వివిధ రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపులు అమరేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మెన్ జడల అమరేందర్ గౌడ్ మాట్లాడారు. అనంతరం పలువురు మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు, కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణితో పాటు పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య, బండారు రవి వర్ధన్, కిష్టయ్య పాల్గొన్నారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలవేసి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహ స్వామి నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమంలో బీసీఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు అశోక్ నాయకులు సాబన్ కార్ వెంకటేష్, వంగరి లక్ష్మీనారాయణ, అతికం లక్ష్మీనారాయణ, గాజుల క్రాంతికుమార్, మోహన్, గుండు జ్యోతి, పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ దళిత సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బిసుకుంట్ల సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి, దళిత సంఘం నాయకులు బట్టు రామచంద్రయ్య, పడిగెల ప్రదీప్, చిలుకమారి గణేష్, కోడారి వెంకటేష్, అందే నరేష్,సీపీ ఐ నాయకులు ఎండి ఇమ్రాన్, పాల్గొన్నారు.బీఎస్పీ నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జోనల్ కోఆర్డినేటర్ గోపి, జిల్లా అధ్యక్షులు కుమార్, జిల్లా కార్యదర్శి సురుపంగా శ్రీకాంత్, కోశాధికారి ఎండపల్లి దాస్, నాయకులు మహేందర్, గంధ మల్ల లింగస్వామి, ఉపేందర్, బండారి శ్రీరాములు, మోహన్ శంకర్ పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని కొలనుపాక గ్రామంలో బస్టాండ్ సమీపంలో జై భీమ్ యూత్ గౌరవాధ్యక్షుడు గడ్డం నాగరాజు ,మాజీ ఎంపీటీసీి మామిడాల అంజయ్య ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ అధ్యక్షుడు సంపత్ కుమార్ ,సభ్యులు కొంగరి వెంకటేష్, నాగరాజు ,చంద్రశేఖర్,బాలకష్ణ , రాజలింగం ,చందు ,బంగారయ్య, యాదగిరి, శ్రీకాంత్ ,భాస్కర్ జగయ్య శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి ,పౌలు బీసీ సంఘం కన్వీనర్ రాములు , యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు ,పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాపోలు మధు , చిరిగే శ్రీనివాస్, బందెల సుభాష్ , భూపతి, జెట్ట సిద్ధులు, తోట వెంకటయ్య , ఐడియా శ్రీనివాస్ , పత్తి రాములు, క్యాసగల్ల రమేష్, భైరపాక నాగరాజు , గదపాక మల్లేషు, సిరిగిరి సారయ్య ,రాజు గణేష్ నరసింహారావు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత,మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, వార్డు సభ్యులు బీరకాయల మల్లేష్ కాంబోజు నాగరాజు, కొల్లూరి మహేందర్, జంగా వెళ్లి జహంగీర్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, వంగాల చంద్రమౌళి పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విగ్రహ ప్రతిష్టాపన స్థలం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోట్ల నరేష్, బుగ్గ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర బోయిన మల్లేష్ యాదవ్, బిర్లా ఫౌండేషన్ మండల ఇన్చార్జి భాస్కరుని రఘునాథ్ రాజ్, బొట్ల నరసింహ, పల్లె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేవేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెల్మజాల యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు వంగపల్లి చిరంజీవి పాల్గొన్నారు,
భూదాన్‌పోచంపల్లి : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మహాత్మబాబు జోతిరావు ఫూలే చిత్రపటానికి చైర్పర్సన్ విజయలక్ష్మి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బత్కలింగస్వామి, కౌన్సిలర్లు పెద్దల చక్రపాణి, సామల మల్లారెడ్డి, మోటి రజిత రాజు, సిబ్బంది చిరంజీవి, వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : మండలం కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని నిర్వహించారు.జెడ్పీటీసీ వీరమళ్ల భానుమతి వెంకటేశం గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుర్వి యాదయ్య గౌడ్ ,బీసీ యువజన సంఘం నాయకులు కార్తిక్ గౌడ్,చిలివేరు బిక్షం, చిలువేరు అంజయ్య గణం నరసింహ మారగోని వెంకటేష్ బద్దుల యాదగిరి బల్లెం రామస్వామి వీరమల్ల కార్తీక్ సూర పల్లి శివాజీ మారగోని వెంకటేష్ పందుల కార్తీక్ బద్దుల యాదగిరి నరసింహస్వామి దితరులు పాల్గొన్నారు.
వలిగొండ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఆదివారం శాఖా గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి , గ్రంథాలయ శాఖ చైర్మెన్‌్ పబ్బు వెంకటరమణ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కందుల అంజయ్య మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపోలు పవన్ కుమార్ ఎన్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లెర్ల సుధాకర్ నాయకులు నానా చెర్ల రమేష్ బత్తిని బిక్షపతి పల్లెర్ల రామచందర్ పాలు చన్ రాజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.