Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని బసవపురం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న బిఎం తిమ్మాపురం గ్రామస్తులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని భూనిర్వాసితుల కమిటీ కన్వీనర్ వల్దాసు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రాజెక్టు వద్ద ఒక వ్యక్తి తనకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆటో పై వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమన్నారు.గ్రామంలో ప్రజలు నష్ట పరిహారం అందక మనోవేదనకు గురవుతున్నారని నూతన గ్రామం ఎక్కడ అనేది ఇంతవరకు తెలియడం లేదని అధికారులను ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్ శ్యాంసుందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.