Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు
నవతెలంగాణ -ఆలేరు రూరల్
ఉపాధి కోసం తాటి చెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మరణించినట్టయితే తెలంగాణ ప్రభుత్వం వారికి నెలలోపే ప్రమాద బీమా అందజేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ అన్నారు. సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర సభ సోమవారం మండలంలోని కొల్లూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్ట కూటి కోసం రోజు ఆకాశం ఎత్తున తాటి చెట్టు ఎక్కి జీవనం సాగిస్తున్న గీతా కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. ప్రభుత్వం టెక్నికల్‌గా ఆలోచించి హైబ్రిడ్ విత్తనాలతో తాటి చెట్లను పెంచినట్టయితే కార్మికులు ఎత్తుగా ఉన్న తాటి చెట్టు ఎక్కకుండా చిన్నగా ఉన్న తాడిచెట్టు ఎత్తి జీవనోపాధి సాగించేందుకు సులభంగా ఉంటుందని సూచించారు .అనంతరం గ్రామంలో ఉండే సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు .ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందం ఎండి. జహంగీర్, కొండమడుగు నరసింహ, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి , రమేష్ నాయక్ ,బట్టుపల్లి అనురాధ, వారితో పాటు మండల కార్యదర్శి రమేష్, గ్రామ శాఖ కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు..