Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ- ఆలేరురూరల్
తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు పెండ్లి చేసుకున్న వారికి రేషన్ కార్డులు, 57ఏండ్లు నిండిన వారికి పింఛన్లకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర బందం సభ్యులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ అన్నారు. సోమవారం జన చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని తూర్పు గూడెం,కొల్లూరు గ్రామాల్లో మండల నాయకులు దుప్పటి వెంకటేష్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. గ్రామ కార్యదర్శి అందే అంజయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే కులవత్తులకు న్యాయం జరుగుతందనుకుంటే అన్యాయమే జరిగిందన్నారు. గొర్రెల కాపరులకు గొర్లు ఇస్తామని ప్రభుత్వం డబ్బులు వసూలు చేసి వాటిని స్వాహా చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళితులకు మూడెకరాల భూమి ఏమైందన్నారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యేలు సీఎంతో కుల వత్తుల గోడు చెప్పకుండా వారి ముంగడ గంగిరెద్దులా తల ఊపినట్టు ఊపడం సరికాదన్నారు. ఆలేరు మండలానికి సాగునీరు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆలేరు శాసనసభ్యురాలు సాగు నీటి పై మాట్లాడడం మానేశారన్నారు. అధికారంలో ఉండటం కాదు గంధ మల్ల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి బీడు భూములను సాగు భూమి చేసే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. అందుకు ఎర్ర జెండా పార్టీ ముందుండి రిజర్వాయర్ నిర్మించే దాకా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాత యాత్ర బందం సభ్యులు కొండమడుగు నరసింహ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ధరావత్ రమేష్ నాయక్,మాటూరి బాలరాజ్ గౌడ్ ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింలు, మండల కార్యదర్శి మురుగా డి.రమేష్ ,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లగాని జయరాములు , వెంకటేష్ ,మధ్య బోయిన ఉప్పలయ్య ,సంగి రాజు ,బోడ హనుమంతు. పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.