Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
- రైతులకు నష్ట పరిహారం అందించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా లోని జిల్లా కేంద్రమైన భువనగిరితో పాటు జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం కారణంగా జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో కి వెళ్లి అంచనా వేయాలని రైతులకు నష్టపరిహారం అందించాలని సీపీఐ(ఎం) జిల్లా పాదయాత్ర బందం డిమాండ్ చేసింది. సోమవారం పాదయాత్ర బందం తరపున జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ నవతెలంగాణ తో మాట్లాడారు. ఐకేపీ సెంటర్ల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర బదం ఆలేరు మండలం శర్బనపురంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం ఉరుములు మెరుపులతో కురిసిందన్నారు. కొద్దిసేపు పాదయాత్ర కు అంతరాయం కలిగిందన్నారు. వర్షంతో పంట నష్టం జరిగిన వరి పొలాలు పాదయాత్ర బందం పరిశీలించిందన్నారు. అకాల వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నందున జిల్లాలో అన్ని ఐకేపీ సెంటర్లు మార్కెట్లలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్‌లో సాయంత్రం వేళలో కొనుగోలు జరుగుతుందని ఆ పద్ధతిని మార్చి ఉదయం నుండి కొనుగోలు చేసే విధంగా మార్కెట్‌యార్డు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐకేపీ సెంటర్లకు పూర్తిస్థాయిలో గన్ని బ్యాగులు,టార్పాలిన్లు అందించాలని కోరారు. ఆయన వెంట ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరు మల్లేశం, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గణేష్ నాయక్ ఉన్నారు.