Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి
- నాలుగేండ్లుగా ఊరిస్తున్న గందమల్ల రిజర్వాయర్
- ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రభుత్వం ప్రకటించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
- పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన ప్రజలు
నవతెలంగాణ- ఆలేరురూరల్
ఆలేరు ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసే గందమల్ల రిజర్వాయర్ను నాలుగేండ్లుగా పూర్తి చేస్తామని చెపుతూ కాలం వెల్లదీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తుందో సమాధానం చెప్పాలని సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర రథసారధి, జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ(ఎం) చేపట్టిన పాదయాత్ర సోమవారం ఆలేరు మండలంలోని తూర్పుగూడెం, కొల్లూరు, శర్బనపురం, ఇక్కుర్తి, మంతపురి, బహదూర్పేటలో కొనసాగింది. పాదయాత్ర బృందానికి బోనాలు, కోలాటాలతో స్వాగతం పలికారు. శర్బనపురం గ్రామంలో ఎట్టన్న స్తూపానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సాగునీటి కాల్వలను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనేక గ్రామాల్లో విలువైన భూములు ఉన్న సాగునీరు అందక ఎలాంటి ప్రత్యామ్నాయం లేక రియల్ఎస్టేట్ వ్యాపారులకు అతి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అన్నారు. వెంటనే గందమల్ల రిజర్వాయర్ ఉందా లేదా సమాధానం చెప్పాలని జిల్లా మంత్రిజగదీశ్రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతను ప్రశ్నించారు. ఉంటే ఎప్పుడు పూర్తి చేస్తారో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం రైతు మార్కెట్లను ఎత్తివేస్తామని చెపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖండించడం లేదో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందన్నారు. ు అయినా రైతాంగం పట్టుదలతో పోరాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందం సభ్యులు కొండమడుగు నర్సింహా, మాటూరి బాలరాజు,కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దరావత్ రమేష్ నాయక్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, అనగంటి వెంకటేష్, బొడ్డుపల్లి వెంకటేష్, సీనియర్ నాయకులు సూదగని సత్యరాజయ్య, పార్టీ మండల కార్యదర్శి మోరిగాడి రమేష్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బోలగాని జయరాములు, మండల నాయకులు దుపటి వెంకటేష్, నవీన్,సిరిగిరి సారయ్య, మాజీ సర్పంచ్లు సైదాపురం నర్సయ్య, సుధగని నర్సమ్మ, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి విద్య సాగర్, నాయకులు కారే రాజు,బద్ధం మూతిరెడ్డి. డీవైఎఫ్ఐ నాయకులు ప్రవీణ్, ప్రశాంత్, కార్తిక్, నవీన్ సాయి, పాల్గొన్నారు.