Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదంతా కరోనా ఎఫెక్టే
- ఖర్చులు ప్రకటించని టెంపుల్ ఆఫీసర్లు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి టెంపుల్ వార్షిక ఆదాయం భారీగా తగ్గింది. భక్తులు క్షేత్ర సందర్శనకు రాకపోవడంతో 57కోట్ల11లక్షల 40వేల 901లకు ఈ ఆదాయం పడిపోయింది. సోమవారం విడుదల చేసిన వాట్సప్ ప్రకటన ద్వారా టెంపుల్ ఆఫీసర్లు వెల్లఢించారు. అంటే 2019-2020 ఆర్థిక సంవత్సరం రూ. 132కోట్లా 6లక్షలా 35 వేలా 834.53ల ఆదాయం రాగా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 74కోటా ్ల94లక్షలా 94వేలా 933.46లు ఆదాయం మాత్రమే సమకూరింది. భారీ మొత్తానికి వార్షిక ఆదాయం పడిపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యింది. డిపాజిట్ల ద్వారా జీతాలు పొందే విపత్కర పరిస్థితి వచ్చింది పలువురు వాపోయారు. ఇదంతా కరోనా ఎఫెక్టే అని టెంపుల్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ నలుమూలల నుండే కాక విదేశీయులు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారే. ప్రపంచ వ్యాప్తంగా విజృభిస్తోన్న కరోనా మహమ్మారీ కాటుకు అన్ని సంస్థలు, రంగాలను కుదేలైన మాదిరిగానే యాదాద్రి టెంపుల్ కూడా చేరిపోయింది. 2019-2020 ఆర్థిక సంవత్సారానికి గాను ప్రభుత్వ అనుమతితోనే ఫిక్స్్డ్ డిపాజిట్లను ఉద్యోగుల జీతాల కోసం రిలీజ్ చేసింది. కాగా పర్వదినాలు, ప్రత్యేకదినాలు, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో సుమారు 25 నుండి30వేల వరకు క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులు కరోనా నేపథ్యంలో ఆ రద్దీ 5వేల పడిపోయిందని టెంపుల్ ఆఫీసర్లు వెల్లఢిస్తున్నారు.
ఖర్చులు ఎందుకు చెప్పరో....
ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలు ఏదైన ఆదాయ వ్యయాలు తెలపడం చూస్తుంటాం. కాని ఈ టెంపుల్లో వార్షిక ఆదాయం మాత్రమే ప్రకటించి ఖర్చులు వెల్లఢించకపోవడం పలు స్థానికంగా అనుమానాలకు తావిస్తోంది. భారీగా అవకతవకలు జరుగుతుండోచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ వ్యయాలు వాస్తవ రూపకంగా ఖర్చులు వెల్లడించని ఎడల పారదర్శకతకు గొడ్డలిపెట్టని పలువురు అభిప్రాయ పడుతున్నారు. యేటా విడుదల చేసే వార్షిక లెక్కల్లో ఆదాయమే తెలిపి ఖర్చులు ఎందుకు చెప్పరోనని భక్తులు వాపోతున్నారు.