Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75 కిలోలకు ఐదు కేజీలు కట్
- రైతుల నిలదీత
- విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు
- మిల్లర్లు, అధికారులు కుమ్మక్కు
- లబోదిబోమంటున్న రైతులు
నవతెలంగాణ కోదాడరూరల్
ఆరుగాలం శ్రమించి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు పోతే మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. 75 కిలోల ధాన్యానికి ఐదు కిలోలు కట్ చేస్తూ రైతులను నిలువుగా ముంచుతున్నారు. ఇలాంటి ఘటనే సోమవారం పట్టణ పరిధిలోని ఖమ్మం రోడ్డులో ఉన్న మిల్లులో వెలుగులోకి వచ్చింది. మిల్లుకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు తూకం వేసేందుకు వెళ్తే 75 కిలోలకు ఐదు క్వింటాళ్లు కట్ చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రైతులు ఆ మిల్లుపై డిప్యూటీ తహసీల్దార్ విమోచన, ఆర్ఐ ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో అధికారులు మిల్లుకు వచ్చి విచారణ చేపట్టారు. టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా శాంపిల్స్ సేకరించారు. నిజంగా మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై తమను ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు.