Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - త్రిపురారం
'కేసీఆర్...జానారెడ్డిని ఓడించడం నీ తరం కాదు' అని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సత్యనారాయణపురం, నిలాయిగూడెం, అంజపల్లి గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో జానారెడ్డి చేసిన అభివద్ధే తప్ప టీఆర్ఎస్ హయాంలో ఏమీ చేయలేదన్నారు. జానారెడ్డిని విమర్శించే స్థాయి ఇక్కడికి వచ్చిన ఇన్చార్జిలకు లేదన్నారు. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను దింపి, ఊరికో పదిహేను మందిని ఏర్పాటు చేసి జానారెడ్డిని ఓడించడానికి ఎంతో ప్రయాస పడుతున్నారని ఆరోపించారు. మద్యం, డబ్బులు, విందులు ఏర్పాటు చేస్తూ రూ.కోట్ల ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అభ్యర్థి జానారెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అభివద్ధి చిన్నపిల్లవాడి నుండి పండు ముసలి వాళ్ల వరకూ అడిగినా చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి, ఎంపీపీ అనుముల పాండ్యమ్మ, శ్రీనివాస్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు కసిరెడ్డి నరేష్, ముడిమాల బుచ్చిరెడ్డి, రాష్ట్ర హనుమయ్య, గుడిపాటి సైదులు, చాగంటి సత్యం, కసిరెడ్డి బాల సైదిరెడ్డి, చాగంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.