Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రామన్నపేట
పల్లివాడ గ్రామానికి చెందిన డీవైఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు, సీపీఐ(ఎం)గ్రామ నాయకులు కడమంచి విష్ణు ధనుస్సు మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సీపీఐ(ఎం) మండల నాయకులు కల్లూరి నగేశ్ అన్నారు. మంగళవారం పల్లివాడ గ్రామంలో ఉన్న విష్ణు మృతదేహంపై పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ కార్యదర్శి కంబాలపల్లి మధు, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు మెట్టు శ్రవణ్, ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు బిక్షం, నర్సింహా, బైకాని నర్సింహా, లక్ష్మణ్, రమేష్, ఉపేందర్, ముకుందం, రాజు, మధు, శ్రీను, సైదులు, రాములు, మునేశ్, సల్ల నర్సింహ, కళ్లెం చిన్న నర్సింహ, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.