Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
టీఎస్‌యూటీఎఫ్ ఆవి ర్భావ దినోత్సవాన్ని మంగళవారం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగం పరిరక్షణ కోసం టీఎస్‌యూటీఎఫ్ నిరంతరం పనిచేస్తుందన్నారు. ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ టీఎస్‌యూటీఎఫ్ సభ్యులున్న పాఠశాలలు సామాజిక అంశాల పట్ల ముందుంటాయని, ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధిలో పెట్టడంలో ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం, కోశాధికారి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు పి.రాజశేఖర్, మురళయ్య, సిహెచ్.రామలింగయ్య, నర్సింహా, మండల బాధ్యులు సైదులు, నవీన్ రెడ్డి, శ్యామ్ కుమార్, నాగయ్య, సైదులు, రమణ, రవీందర్, రాఫెల్ తదితరులు పాల్గొన్నారు.