Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపవాస దీక్షలు, ముస్తాబైన మసీదులు
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన కమిటీలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ముస్లిములు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసమంతా ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ నెల రోజుల పాటు ప్రతి ముస్లిం తప్పనిసరిగా రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారు. ముస్లిముల పవిత్ర గ్రంథం ఖురాన్ కూడా ఈ రోజే ఆవిర్భవించడంతో దీన్ని వారు ప్రముఖ మాసంగా భావిస్తారు.
కఠోరమైన ఉపవాస దీక్షలు
ఈ నెలలో ప్రతి ముస్లిం విధిగా ఉపవాస దీక్షలు ఉంటారు. రోజాగా పిలిచే ఈ ఉపవాసం 30 రోజుల పాటు కఠిన సవాళ్లతో కూడుకుని ఉంటోంది. ఉపవాసవ్రతం చేపట్టే ముస్లిములు రంజాన్ నెల ప్రారంభంకాగానే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆహారం తీసుకొని దీక్ష ప్రారంభిస్తారు. ఆ తర్వాత సూర్యాస్తమయం వరకూ ఎలాంటి ఆహారమూ స్వీకరించరు. అనంతరం వివిధ రకాల రుచికరమైన వంటలను భుజిస్తారు. ఉపవాసదీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తాయి.
ముస్తాబైన మసీదులు
రంజాన్ మాసం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులను ముస్తాబు చేశారు. మసీదు కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముస్లిములు ప్రార్థన చేసే సమయంలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో జరిగే తరావీ నమాజ్‌ను కూడా పరిమిత సంఖ్యలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా మసీదుల్లో తక్కువ మందితో నమాజ్ చేసేలా సూచనలు చేశారు. ప్రార్థనలకు వచ్చే ముస్లిములు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని మత పెద్దలు కోరారు.