Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనచైతన్య పాదయాత్ర రథసారధి జహంగీర్
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వస్తే వారి సమస్యలు తెలుస్తాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్ అన్నారు. యాదాద్రి జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన జన చైతన్య పాదయాత్ర మంగళవారం ఆలేరులో పర్యటించింది. ఈ సందర్భంగా స్తానిక దినేష్ గార్డెన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర బృందం ప్రజల వద్దకు వెళ్తుంటే పాలకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాలోని సమస్యలపై చర్చించేందుకు ప్రజల మధ్యలో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జిల్లాలోని ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని మూసీ నది ప్రక్షాళన చేయాలని వాజ్పేయి పాలనలో నిర్ణయించారని, కానీ నేటి వరకూ చేయలేదన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ నీరు ఇంటింటికి అందడం లేదరన్నారు. మంచినీరు కొనేందుకు ప్రతి కుటుంబం రూ.2000 నుంచి రూ.3 వేల వరకూ ఖర్చు చేస్తుందని చెప్పారు. ఆలేరు ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో కేవలం డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, దీంతో పేదలకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారుర. జిల్లాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఐపీ సేవలు వెంటనే ప్రారంభించాలన్నారు. అనంతరం పాదయాత్ర బృందం సభ్యులకు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మంగ నర్సింహులు ఆధ్వర్యంలో దాత రమేష్ సహకారంతో మెమెంటోలు అందజేశారు. పాదయాత్ర బందం సభ్యులు కొండమడుగు నర్సింహా, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ధారావత్ రమేష్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు సుర్పంగి స్వామి, అనగంటి వెంకటేష్, బొడ్డుపల్లి వెంకటేష్, మాజీ సింగిల్విండో చైర్మెన్ మొరిగాడి చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి జూకంటి పౌల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, సిర్పంగి స్వామి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మొరిగాడి రమేష్, సీనియర్ నాయకులు వడ్డేమాన్ శ్రీనివాసులు, ఎలుగల బాలయ్య, తాళ్లపల్లి గణేష్, మంగ అరవింద్, చెన్న రాజేష్, ఎలుగల శివ, భువనగిరి గణేష్, ఘణగాని మల్లేష్, మొరిగాడి అశోక్, కాసుల నరేష్, గొడుగు దాసు, చెక్క రమేష్, బోడ వెంకటయ్య, గజ్జెల నర్సింహులు, గణగాని రాజు, చెక్క పరశురాములు, సిద్ధులు, సీపీఐ(ఎం) నాయకులు పాల్గొన్నారు.