Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
రోడ్డు ప్రమాదంలో భర్తాభార్య దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం మండలంలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉప్పలపహాడ్ బస్‌స్టేజీ వద్ద చోటు చేసుకుంది.ఎస్సై బి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన చలకాని అంజయ్య (50) అతని భార్య యాదమ్మ(48) ఇరువురు ఉప్పలపహాడ్ స్టేజీ వద్ద బస్సు దిగి తన బంధువులు ఇంటికి ఉప్పలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని భాగ్యనగర్‌కు వెళ్తుండగా 65 నెంబర్ జాతీయ రహదారిని దాటుతున్న సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో వారిద్దరికీ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.