Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
గేదెలు, ఎద్దులను చోరీ చేసి సంతలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న దొంగలను అరెస్టు చేసినట్టు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగరాజ్‌తో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.నకిరేకల్ పట్టణ పరిధిలోని చీమలగడ్డకు చెందిన వంటెపాక పాపయ్య, కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన జక్కలి వెంకన్న, మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన మీసాల దానియేలు ప్రతి బుధవారం రాత్రి సమయంలో నకిరేకల్ మండలంలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ ఇండ్లకు దూరంగా, పొలాల వద్ద కట్టేసిన పశువులను చోరీ చేస్తున్నారు. దొంగతనం చేసిన పశువులను డానియల్ కు చెందిన అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటోలో ఎక్కించి మరుసటి రోజు గురువారం గుంటూరు జిల్లా గురజాల సంత తీసుకెళ్లి అక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.నకిరేకల్ సీఐ నాగరాజు తన సిబ్బందితో మంగళవారం చీమల గడ్డ నిమ్మకాయల మార్కెట్ వద్ద గస్తీ నిర్వహిస్తుండగా సదరు ముగ్గురు నేరస్తులు ట్రాలీ ఆటోలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.నిందితులు వంటెపాక పాపయ్య వద్ద రూ రూ.97,500, జక్కలి వెంకన్న వద్ద రూ.97500తో పాటు వారి సెల్ఫోన్లు, మీసాల దానియేలు ఉపయోగించిన ఆటోతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.