Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాలియాలో నేడు లక్ష మందితో సభ
- కోవిడ్ నిబంధనలు అమలు జరిగేనా..?
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సీఎం కేసీఆర్ నేడు నల్లగొండ జిల్లా హాలియా కు రానున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం రాక సందర్భంగా లక్ష మందితో సభ నిర్వహించేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలకనుగుణంగా సభ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సీఎం సభ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ సుమారు 5 గంటలకు హాలియాకు చేరుకుంటారు. అయితే సభలో ఆయన కేవలం 30 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం ప్రయాణ ఖర్చు బరిలో ఉన్న అభ్యర్థి ఖర్చులో జమ అవుతుందనుకుంటే హెలికాప్టర్లో సభకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే రోడ్డు మార్గాన మాత్రమే రానున్నారు. సభ ఏర్పాట్లను రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు పర్యవేక్షించారు. సభలో సీఎం కేసీఆర్‌తో పాటు సాగర్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్, మంత్రులు జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొననున్నారు.
కోవిడ్ నిబంధనలు అమలు జరిగేనా..?
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే పాఠశాలలు మూసివేసింది. ఏ ఒక్కరూ మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిం చొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎవరు మాస్క్ ధరించకపోయినా రూ.1000 జరిమానా విధిం చాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించకపోతే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే లక్ష మందితో హాలియాలో నిర్వ హించే భహిరంగ సభలో కోవిడ్ నిబంధనలు అమ లు జరిగేనా అనే అనుమానం వస్తోంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిపై చర్యలు తీసుకుం టారు... జరిమానా విధిస్తారు... అధికార పార్టీ బహిరంగ సభకు వచ్చిన వారిపై నిబంధనల పేరు తో జరిమానా వేస్తే పార్టీ నేతలు సహిస్తారా... ఈ సభతో ఎంత మందికి కరోనా వైరస్ సోకే ప్రమా దం ఉందోనే ఆందోళన అందరి లోనూ ఉంది. ఉగాది పండుగను కూడా ఇంట్లోనే ఉండి చేసుకోవా లన్న ప్రభుత్వం.. లక్ష మందితో ఈ సభ నిర్వహించ డంలో అర్థమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.