Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఎస్‌యూటీఎఫ్ నాయకత్వం నిరంతరం ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం పని చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆ సంఘం భవనంలో ఆయన జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగించారు.రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్,పెన్షనర్ల సమస్యల పరిష్కారాని కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని చెప్పారు.విద్యారంగ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేస్తున్న యూటీఫ్ సంఘం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తూ రాష్ట్రంలో ప్రత్యేక విద్య కమిషన్ ఏర్పాటు చేయుటకు నిరంతరం పోరాడుతుందన్నారు.తద్వారా ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది స్పష్టం చేశారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఆశిస్తున్న ఆంగ్ల మాద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు.ఖాళీగా ఉన్న డీఈఓ, డిప్యూటీ డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.పర్యవేక్షకులను పటిష్టం చేయాలని, ప్రధానో పాధ్యాయులు,స్కూల్ అసిస్టెంట్లు, పండిట్, పీఈటీలకు వెంటనే పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించాలన్నారు.తద్వారా ఏర్పడిన ఖాళీలను నూతన డీఎస్సీతో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.అనిల్‌కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.సోమయ్య అధికారి కోశాధికారి వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, వెంకన్న, పాపిరెడ్డి,పి.అనిల్‌కుమార్, సీిహెచ్.రమేశ్, క్రాంతిప్రభ, బి.రమేశ్, సీనయ్య, సైదా, వేణు, లాలూ, శంకర్, లింగయ్య, ఆనంద్, రత్నకుమారి, రాఘవులు, అంజయ్య, జాన్అర్జున్, చందునాయక్,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.