Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
మార్చి నుండే ప్రయివేట్ టీచర్లకు రూ.2 వేలు, రేషన్ బియ్యం ఇవ్వాలని ప్రయివేట్టీచర్స్ ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గొట్టె నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రైవేట్ టీచర్ల యూనియన్ సమావేశం మంగళవారం స్థానిక టౌన్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లకు ప్రకటించిన ఆర్థిక సహాయం మార్చి నుండి ఇవ్వాలన్నారు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తో పాటు సిబ్బంది మరియు ఆయాలు బస్సు డ్రైవర్లు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకోవాలన్నారు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఎటువంటి వివక్ష లేకుండా తమ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు అన్ని ఎంఈఓల ద్వారా డీఈఓకు పంపించి ఆర్థిక సహాయం త్వరగా అందేవిధంగా సహకరించాలన్నారు.ఈ సమావేశంలో కంచర్ల భూపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రమేశ్, శ్రీనివాస్, వి.అరుణ, సురేందర్‌రెడ్డి, ప్రకాష్, అన్నాజి, నాగరాజు, భాస్కర్, వెంకట్‌రెడ్డి, రాకేష్ పాల్గొన్నారు.