Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మునుగోడు
ఈ నెల 16న మునుగోడు సంత బహిరంగ వేలం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్.మురళి మోహన్ తెలిపారు. బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. సంత వేలంలో పాల్గొనేవారు గ్రామపంచాయతీకి ఎలాంటి బాకీలు ఉండొద్దన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ మునుగోడు పేరిట బ్యాంకులో 40,000 డీడీ తీసి పట్టాదారుని ఫొటోతో దరఖాస్తు చేసుకుని రశీదు పొందాలన్నారు. కాంట్రాక్టు కాల పరిమితి 22-04-2021 నుంచి 31-03-2022 వరకూ ఉంటుందన్నారు. కౌలు దారుడు పాడిన వేలంలో అగ్రిమెంట్ రాసి ఇచ్చిన మొత్తంలో కౌలులో1/2 వంతు వెంటనే గ్రామ పంచాయతీకి చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుందని తెలిపారు. డబ్బులు అగ్రిమెంట్ ప్రకారం చెల్లించకపోతే ఐదు శాతం అపరాధ వడ్డీ వసూలు చేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో గ్రామపంచాయతీ ఎలాంటి బాధ్యతా వహించదన్నారు. ఆసక్తి కలిగిన పాట దారులు సూచనలు పాటిస్తూ వేలంలో పాల్గొనాలని కోరారు.