Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
నవతెలంగాణ - నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరూ ఏకమై జానారెడ్డికి అండగా నిలబడి గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కోరారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అభ్యర్థి జానారెడ్డితో కలిసి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్ ఒక్క సారి కూడా అంబేద్కర్, జ్యోతిరావుపూలే, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి, వర్ధంతులకు వారి చిత్ర పటాలకు నివాళులర్పించలేదన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదేండ్లు గడిచినా నేటి వరకూ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, బెల్లయ్యనాయక్, ప్రదీప్‌గౌడ్, రాంబాబు, రంగారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.