Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగార్జున సాగర్
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో గల బుద్ధవనాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీ బుధవారం సందర్శించారు. 10 రోజుల నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎన్నికల క్యాంపెయింగ్లో ఉన్న హోం మంత్రి నాగార్జునసాగర్ డ్యాం, బుద్ధవనం, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలి ట్రిప్పు చేసి సరదాగా గడిపారు. ఆయనతో పాటు ముస్లిం, మైనార్టీ నాయకులు, డ్యామ్ ఆర్ఐ పవన్ కుమార్, టీఆర్ఎస్ కేవీ నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్కె.బషీర్, గైడ్ సత్యనారాయణ పాల్గొన్నారు.