Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొమ్మలరామారం : మండలంలోని మల్యాల గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాష్ట ఎస్సీ ఎస్టీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వంగపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభివద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని నినాదంతో ముందుకు సాగుతూ దళిత వర్గాలను బలోపేతం చేసిన ఏకైక వ్యక్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత ఉట్ల నరసింహ,ఎంపీపీ సుధీర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గొడుగు శోభ చంద్రమౌళి, ఎంపీటీసీ మైలారం ఈదమ్మ యాదయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సింగిల్విండో చైర్మెన్్ బాల నరసింహ ,కష్ణారెడ్డి, మేడబోన గణేష్ ముదిరాజ్, భొనంకుర మల్లేష్ ,మైలారం రామకష్ణ, గ్రామస్తులు ఆదర్శ యూత్ అధ్యక్షులు ఆశయ, ఆదర్శయూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.