Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదాద్రి టెంపుల్‌ను అభివృద్ధి చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవద్దని,యాదాద్రి టెంపుల్ పరిధిలో ఉన్న పరిసర గ్రామాల అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి పెట్టి వాటికి సరిపడా నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్ డిమాండ్ చేశారు .సీపీఐ(ఎం)జనచైతన్య పాదయాత్ర బుదవారం మండల పరిధిలోని కాచారం. గౌరయిపల్లి గ్రామాలలో పర్యటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ అబివద్ధి పేరుతో హడావుడి చేస్తోందన్నారు. యాదాద్రి టెంపుల్ని అభివృద్ధి చేయడం చాలా మంచి పరిణామం అయినప్పటికీ టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయన్నారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు. హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తక్కువ ధరకు భూమిని అమ్ముకున్నారన్నారు. చుట్టూ గ్రామాలు. కనీస వసతులకు నోచుకోకుండా ఇంకా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పరిసర గ్రామాల్లో ,కనీస వసతులు అయినా రోడ్లు, మంచినీటి వసతిని వెంటనే కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమిని పంపిణీచేయాలని డిమాండ్ చేశారు. రెండేండ్లుగా పింఛన్లు రాక పడుతున్నారన్నారు. ఏడేండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వెంటనే రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గుట్ట అభివద్ధి పేరుతో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం వెంటనే ఇవ్వాలని. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో బంద సభ్యులు కొండమడుగు నరసింహ, మాటూరి బాలరాజు ,కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి,ధరావత్ రమేష్ నాయక్, జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొల్లూరి రాజయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి. బబ్బురి పోశెట్టి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి ఆనగంటి వెంకటేష్, బొడ్డుపెళ్లి వెంకటేష్, మండల నాయకులు షరీఫ్, రవి, శివ, తదితరులు పాల్గొన్నారు.
దుంపల మల్లారెడ్డి ప్రజా సేవలు చిరస్మరణీయం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
ఆలేరుటౌన్ : సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దుంపల మల్లారెడ్డి ప్రజా సేవలు చిరస్మరణీయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని గొలనుకొండ గ్రామనికి చేరుకున్న జనచైతన్య పాదయాత్ర ,తూర్పుగూడెం,శర్బనాపురం, మంతపురి, బహదూర్ పేట, ఆలేరు మున్సిపల్ కేంద్రం, గుండ్లగూడెం, పటేల్‌గూడెం,గ్రామాల్లో సభలు నిర్వహించారు. మండల ప్రజల నుండి పాదయాత్ర బందానికి అపూర్వ ఘనస్వాగతం లభించింది బుధవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండలం కాచారం బస్టాండ్ చౌరస్తా వద్ద వీడ్కోలు పలికారు. దుంపల మల్లారెడ్డి ఇతర అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య పాదయాత్ర బందం సభ్యులు కొండమడుగు నరసింహులు, కల్లూరి మల్లేశం, మాటూరి బాలారాజు, బట్టుపల్లి అనురాధ ,కోమటిరెడ్డి చంద్ర రెడ్డి, రమేష్ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు మంగ నర్సింహులు, డీవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఆనగంటి వెంకటేష్ ,బొడ్డుపల్లి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎంఏ ఎక్బాల్ నాయకులు వడ్డేమాన్ శ్రీనివాసులు, మంగ అరవింద్ , ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్న రాజేష్ ,కళాకారులు పాల్గొన్నారు
అట్టడుగు వర్గాల అభివద్ధి కోసం అంబేద్కర్ ముందుచూపు
ఆలేరుటౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమాజంలో ఉన్న అటువంటి అట్టడుగు వర్గాల అభివద్ధి పథంలో నడిపించడం కోసమే ముందుచూపుతో రాజ్యాంగాన్ని నిర్మించారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలోదినేష్ గార్డెన్ ఆవరణలో అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని జన చైతన్య పాదయాత్ర బందం సభ్యుల సమక్షంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే సమాజంలో ఉన్నటువంటి అత్యధిక శాతం ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కుతున్నారన్నారు. భారత దేశంలోని ప్రజలందరూ ఐక్యంగా నిలిచి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. దళితులు అట్టడుగు వర్గాలకు విద్యను అందించడం ద్వారా దేశం ముందుకు వెళుతుందని అన్నారు. కులాల మధ్య మతాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రోత్సహించడం ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సమాజంలో అలజడి సష్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. నేడు పాలకులు అన్నదమ్ముల్లాంటి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య యాత్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహులు, కల్లూరి మల్లేశం , మాటూరి బాలరాజు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బట్టుపల్లి అనురాధ , దరవతు రమేష్ నాయకు, జిల్లా కార్యవర్గ సభ్యులు మంగ నర్సింహులు, పట్టణ కార్యదర్శి ఎక్బాల్, నాయకులు ఎలుగల బాలయ్య , మంగ అరవింద్, చెన్నై రాజేష్,కాసుల నరేష్, భువనగిరి గణేష్ ,తదితరులు పాల్గొన్నారు.