Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
అంబేద్కర్ ఆశయ సాధన స్ఫూర్తితో మనువాదంపై పోరాడుదామని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నంపట్ల కష్ణ సిర్పంగి స్వామి పిలుపునిచ్చారు. బుధవారం తిరందాసు గోపి విజ్ఞాన కేంద్రంలో కేవీపీిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతిని నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతికున్నంతకాలం అంబేద్కర్‌ను అనేక రకాలుగా అవమానపరిచిన ఇబ్బందులకు గురి చేసినా బ్రాహ్మనిజం భావజాలం కలిగిన బీజేపీ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ వస్తున్నట్టు నటిస్తూ అంబేద్కర్ వాదులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున ా్నరన్నారు. ఈ కార్యక్రమంలో కెేవీపీఎస్ నాయకులు కల్మర రాజు,రేముడాల క్రాంతికుమార్ సందెల రాజేష్,మైలారం శివ. నరేష్,చింటూ,రమణ పాల్గొన్నారు.
మండలంలోని అనాజిపురంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి రూరల్ ఎస్ఐ కె .సైదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏదునూరి ప్రేమలత మల్లేశం , ఎంపీటీసీ గూనుగుంట్ల కల్పనా శ్రీనివాస్,ఉప సర్పంచ్ మైలారం వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు. వాడయి గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ సర్పంచ్ కోట పెద్ద స్వామి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నిల ఓం ప్రకాష్ గౌడ్ పూలమాలలు వేశారు. వడపర్తి గ్రామంలో సర్పంచ్ ఎలిమినేటి చిన్న కష్ణారెడ్డి, ఉపసర్పంచ్ బొబ్బిలి మన్నెమ్మ, చీమల కొండూరు గ్రామంలో సీపీఐ(ఎం)నాయకులు వడ్డెబోయిన వెంకటేశం, హనుమాపురం గ్రామంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, దయ్యాల మల్లేష్, తో పాటు వివిధ గ్రామాలలో యువజన సంఘాలు, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు.
ఆలేరురూరల్ : మండలంలోని గొలనుకొండలో మహాజన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ బైరపాక లక్ష్మి రామచంద్రయ్య, ఎంపీటీసీ బైరపాక లక్ష్మిరాంమల్లయ్య, యూత్ అధ్యక్షులు బై రాపాక రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పు గూడెంలో పంచాయతీ కార్యదర్శి ఇందిరా ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ శ్రీశైలం,ఉప సర్పంచ్ రాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగుటూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కల్లెపు శ్రవణ్ అధ్యక్షులు కల్లెపు నాగరాజు, సర్పంచ్ కట్టనర్సింహారెడ్డి పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మున్సిపల్ కేంద్రంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు గోపగోని లక్ష్మణ్, కోరగోని లింగస్వామి, రాజ్యలక్ష్మీ, విజయలక్ష్మీ, నాగరాజు, మంజుల, సైదులుగౌడ్, అరుణ, పోలోజు శ్రీధర్‌బాబు, శిరీష, సందగల్ల విజయ, ఉబ్బు వరమ్మవెంకటయ్య, కామిశెట్టి శైలజ పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ :అంబేద్కర్ జయంతి సందర్బంగా బొడ్డు పోషయ్య జ్ఞాపకార్ధం మున్సిపల్ కేంద్రంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతి రాములు, కందుల శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు జింకల రామకష్ణ, పూల శ్రవణ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ పాల్గొన్నారు. ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాల్‌రాజు పూలమాలలు వేశారు. మున్సిపల్ కేంద్రంలో అంబ్కేదర్ చిత్రపటానికి వార్డు కౌన్సిలర్లు భేతి రాములు , దాసి నాగలక్ష్మి సంతోష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోకౌన్సిల్ సభ్యులు సీసా రాజేష్ , స్వామి పాల్గొన్నారు. దీనశరణ్యా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ సర్పంచ్ చింతకింది మురళీ, సంస్థ అధ్యక్షులు చింతల సాయిబాబా, పూలమాలలు వేశారు. బీఎస్పీ ,బీజేపీ ,పార్టీల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయా పార్టీల నాయకులు తుంగ కుమార్ , మొరిగాడి శ్రీశైలం, బడుగు జహంగీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్, టీఎస్ ఎమ్మార్పీఎస్ ,ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి గర నరేష్, భైరపాక నాగరాజు ,క్యాసగల్ల రమేష్, గదపాక మలేష్, సంగి స్వామి, మధుపూలమాలలు వేశారు. ఫ్రెండ్స్‌క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి అధ్యక్షులు పూలనాగయ్య పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ జేఏసీ నాయకులు సత్యనారాయణ , క్లబ్ ఉపాధ్యక్షులు ఆడెపు బాలస్వామి పాల్గొన్నారు
అడ్డగుడూర్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత బహుజనులు బాలెంల బాబు, పరమేష్ గూడెపు, కొంగరి శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలెంల విధ్యాసాగర్, గూడెపు పాండు, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చెడే మహేందర్ పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండలకేంద్రంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు వంగపల్లి ఉప్పలయ్య, కొల్లూరి స్వామి పాల్గొన్నారు. వర్టుర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పల్లే శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీపీ ఫైళ్ల ఇందిరా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మెన్ ఎగ్గిడి బాలయ్య, టీిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ సిరబోయిన నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం : అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం, టీఆర్ఎస్, కుమ్మరి శాలివాహన సంఘం, వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో, పుట్టపాకలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో , సర్వేలో డీఎస్పీ ఆధ్వర్యంలో, గుజ్జలో టీడీపీ ఆధ్వర్యంలో, లింగ వారి గూడెంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు గుండమాల సతీష్, కట్ట నర్సింగ్ రావు, జెడ్పీటీసీి వీరమల్ల భానుమతి, ఎంపీపీ గుత్తి ఉమాదేవి, సీపీఐ(ఎం)నాయకులు దొంతగొని పెద్దలు, పిట్ట రాములు ,కష్ణ, కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షులు చిలువేరు అంజయ్య, డీఎస్పీ,, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం : మండలంలోని పెద్దపర్వతపూర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్130 వ జయంతిని పురస్కరించుకుని ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డేబోయిన లక్ష్మి నర్సయ్య, ఎంపీటీసీ హేమంత్ రెడ్డి, రాంలింగంపల్లి సర్పంచ్ యాంజల కళ సత్యనారాయణ,తిమ్మాపూర్ ఎంపీటీసీ ధీరవత్ శ్రీహరి నాయక్ పాల్గొన్నారు.
రాజాపేట : అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం శివ స్వామి గురూజీ అమరావతి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత డాక్టర్ చింతల ప్రియారవీందర్, సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మశ్రీశైలం, ఎంపీటీసీ దాచేపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు
మోత్కూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దేశప్రజలకు ఎన్నో హక్కులు కల్పించారని, తరతరాలకు ఆయన ఆదర్శనీయుడని హైదరాబాద్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెమందుల
సామేల్ అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని పాలడుగులో చిత్రపటానికి , విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ మరిపెల్లి యాదయ్య, మాజీ సర్పంచ్ అంతటి నర్సయ్య, నాయకులు బి.యాదిరెడ్డి పాల్గొన్నారు..అంబేద్కర్ 130వ జయంతిని వివిధ పార్టీలు, దళిత సంఘాలు, బీఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దాచారం, అనాజిపురం, పొడిచేడు, కొండగడప, దత్తప్పగూడెం, మోత్కూరు తదితర గ్రామాల్లో ఆయన చిత్రపటాలు, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్ఎర్రవెల్లి మల్లమ్మ,తొంట తిరుపయ్య, బీఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, టీజీపీఏ యాదాద్రి జోనల్ అధ్యక్షుడు తొంట భాస్కర్, మేడి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : అంబేద్కర్ 130వ జయంతి వేడుకలరె మండల కేంద్రంలోని సంజీవయ్య నగర్ లోని అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వేరో మండల కమిటీ అధ్యక్షుడు కక్కిరేణి విజరు కుమార్, మండలంలోని నీర్నెములలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ చింతపల్లి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, ఎమ్మార్పీఎస్ మండల నకిరెకంటి నర్సింహ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీటీసీ వేమవరం సుధీర్ బాబు, మండలంలోని వెల్లంకి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, నిర్నేముల గ్రామ సర్పంచ్ ముత్యాల సుజాత, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ జలంధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి :పురపాలక కేంద్రంలో జూలూరు, బ్లాక్పల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిట్టి పోలు విజయలక్ష్మి శ్రీనివాస్,ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి , జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ చైర్మెన్ బాత్కలింగస్వామి,తదితరులు పాల్గొన్నారు.