Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్
నవతెలంగాణ-హాలియా
టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ అన్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డితో కలిసి హాలియా మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఉప ఎన్నికల్లో జానారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుకుడాల ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి మద్దెల సంతోష్, బాలకష్ణ నేత, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, చెర్లపల్లి గౌతమ్, ఏసురాజ్, నరేష్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.