Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగారం
ప్రతిఒక్కరూ కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని లక్ష్మాపురం సర్పంచ్ గుంటపల్లి సుధాకర్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో 80 మందికి పైగా తుంగతుర్తి పీహెచ్సీ వైద్య బందం కరోనా టెస్టులు నిర్వహించింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంటపల్లి సుధాకర్, హెల్త్ అసిస్టెంట్లు యాదగిరి, నర్సింహాచారి, ఆయూష్ ఫార్మాసిస్టు సతీష్, ఆశా కార్యకర్త మల్లెపాక శోభ, అంగన్వాడీ టీచర్ మల్లెపాక కవిత, మల్లెపాక వెంకన్న, మల్లెపాక సోమయ్య, మరిపెళ్లి వీరయ్య, శాగంటి రవి, దురుసోజు పరమేష్ పాల్గొన్నారు.
పాలకవీడు : కరోనా వైరస్ వ్యాప్తి అధికమౌతున్నందున ప్రజలందరూ తప్పక మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు పాటించాలని పాలకవీడు ఎస్సై నరేశ్ అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని మాట్లాడారు. కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం ప్రజలకందిస్తున్న వ్యాక్సిన్ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాగయ్య, ఆరీఫ్, సూపర్వైజర్ శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేరేడుచర్ల: కరోనా విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అని,ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ నూకల సుగుణసత్యనారాయణరెడ్డి అన్నారు.స్థానిక ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో కుటుంబంతో వచ్చి కరోనా టీకా వేయించుకున్నారు.
తుంగతుర్తి :కరోనా మహమ్మారి రెండోదశ వేగంగా వ్యాప్తి చెందుతున్న దష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మండలవైద్యాధికారి నాగునాయక్ అన్నారు. బుధవారం కాశీతండా, లక్ష్మాపురం, జొన్నలగడ్డతండా గ్రామాలలో మొబైల్ టీం ద్వారా 176 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌గా నిర్దారణ అయ్యిందన్నారు.కరోనా విజృంభించకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సామాజికదూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.తుంగతుర్తి ప్రాంతీయ వైద్యశాలలో ప్రతిరోజు 45 ఏండ్లు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తారని సూచించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ సముద్రాలసూరి, హెల్త్ అసిస్టెంట్లు గాజులసోమయ్య, తాటిపాముల నర్సింహాచారి, పోలేబోయిన వేణుగోపాల్, యాదగిరి, సర్పంచులు సుధాకర్, వెంకన్న, మేగ్యా, ఆశావర్కర్స్ సరస్వతి, శోభ పాల్గొన్నారు.