Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నేటి యువత,విద్యార్థులు జార్జిరెడ్డి ఆశయాలతో ముందుకు నడవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు.జార్జిరెడ్డి 49వ వర్థంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.జార్జి 25 ఏండ్లకే మతోన్మాదుల చేతుల్లో హత్య కాబడ్డ పీడీఎస్యూ వ్యవస్థాపకులు, విప్లవ కిశోరం జార్జిరెడ్డి ఉన్నత కుటుంబంలో పుట్టారన్నారు.జార్జి తనకి సిరి సంపదలు ఉన్నాయన్నారు.రసాయన శాస్త్రంలో ఆయన గోల్డ్మెడల్ సాధించారని వివరించారు.ఆయనకు ఎన్నో ఉన్నతమైన అవకాశాలు వచ్చినా వాటిని కాదని అణిచివేతకు గురవుతున్న ఉస్మానియా విద్యార్థులకు అండగా నిలబడి మతోన్మాదులను, ఫాసిస్టు అరాచకశక్తులను ఎదుర్కొంటూ పీడీఎస్యూ తరపున ఉస్మానియాలో ఎన్నికలలో నిలబెట్టి రెండుసార్లు విజయకేతనం ఎగరవేశారని చెప్పారు.అది జీర్ణించుకోలేని అరాచకశక్తులు జార్జి ఉంటే తమ ఆటలు సాగవని తలచి మారణాయుధాలతో దాడి చేసి జార్జిని అతి కిరాతకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాంటి జార్జి హైదరాబాద్ చేగువేరాగా ప్రతి ఒక్కరిలో చెరగని ముద్ర వేసుకొని నేటితరానికి ఆదర్శంగా నిలబడ్డ విప్లవ యువ కిశోరం జార్జి ఆశయ సాధన కోసం ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు సింహాద్రి, పీవైఎల్ నాయకులు వీరబాబు,నాయకులు ఆరుట్ల శంకర్రెడ్డి, జీవన్, గోపి, మహేష్, వేణు, నవీన్, వేణు, వినరు, గణేష్, మనీష్, విష్ణు పాల్గొన్నారు.