Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-చిట్యాల
ఉపాధి కూలీలకు లేబర్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని ఎలికట్టే, నేరడ, ఉరుమడ్ల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో కొన్ని తరగతుల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీలో ఇలాంటి రాయితీలు వ్యవసాయ కార్మికులకు ప్రకటించలేదన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి అర్రురి నర్సింహా, ఉపాధ్యక్షులు గోపగోని వెంకన్న, నాయకులు మందుగుల యాదయ్య, ఐతరాజు నర్సింహా, వడ్డెగాని అనురాధ, లావణ్య, కృష్ణయ్య, మాధవి, రాంబాబు, రాజ్యలక్ష్మి, లింగమ్మ, సురేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.