Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటమి భయంతోనే కాంగ్రెస్ శ్రేణులపై దాడులు
- కరోనా విజంభిస్తున్న వేళ లక్ష మందితో సభ అవసరమా ?
- టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని రూ.కోట్లు ఖర్చుపెట్టినా కాంగ్రెస్ అభ్యర్ధి కె.జానారెడ్డి విజయాన్ని ఆపలేరని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన గుర్రంపోడు మండలం నడికూడ, బొల్లారం, మొసంగి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు డబ్బుతో ఓట్లు కొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్కు చెంప చెల్లుమనే తీర్పును నాగార్జున సాగర్ ప్రజలు ఇవ్వనున్నట్టు తెలిపారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు ప్రజారక్షణ, ఆరోగ్యం కంటే ఓట్లు, సీట్లు ఎక్కువయ్యాయన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో లక్ష మందితో బహిరంగ సభ ఎలా పెడతారని ప్రశ్నించారు. అనుముల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల సాయంతో టీఆర్ఎస్ నేతలు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓటమి భయంతోనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ, కనగల్, గుర్రంపోడ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .