Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
సమాజంలో అసమానతలు తొలగించేందుకు అంబేద్కర్ జీవితకాలం కృషి చేశారని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద, దేవరకొండ రోడ్డులోని డీఈవో కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత, సమాజంలో అసమానతలు తొలగించేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితకాల పోరాటం చేశారన్నారు. సమాజ పునర్ నిర్మాణానికి అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేశ్, అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, వి.చంద్రశేఖర్, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్లో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, నాయకులు ఎమ్‌డి.సలీం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, కొండ వెంకన్న, నలపరాజు సైదులు, భూతం అరుణకుమారి, బ్రహ్మచారి, అద్దంకి నర్సింహా, కోట్ల అశోక్‌రెడ్డి, సతీష్, మౌనిక, రఘువరన్, నాగరాజు, నర్సింహా, ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మనాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీ కాలేజీ అధ్యాపకులు నదకుమార్, సునీత, హరిత, ఉన్న అంజయ్య, సిబ్బంది రెఖ్యానాయక్, శ్రీకాంత్, మహేష్, రమేష్ పాల్గొన్నారు.
సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొమ్మరబోయిన కేశవులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దుబ్బా శ్రీను, పన్నాలగోపాల్రెడ్డి, వంశీ, వర్మ, మనోజ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షులు చెరుకుసుధాకర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండేటి మురళి పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లా దేవేందర్‌రెడ్డి, ఎల్.శ్రావణ్‌కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి : అంబేద్కర్ యువ కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు గాలెంక గురుపాదం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పూల వెంకటయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, త్రివేణి సంఘం చైర్మెన్ ఈద శేఖర్, కోరె మురళి, పెరుమాండ్ల శ్యాంసుందర్ పాల్గొన్నారు.
స్వాములవారి లింగోటం గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్‌రెడ్డి పూలమాలల వేసి నివాళులర్పించారు.
దేవరకొండ : మండలంలోని పడమటిపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, గ్రామ సర్పంచ్ కిన్నెర యాదయ్య, ఎంపీటీసీ పల్లే పర్వతాలు, గ్రామ మాజీ సర్పంచ్ ముసలయ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు పల్లే బలరాం, యువజన నాయకులు పల్లె శేఖర్, సెంట్రల్ యూనివర్సిటీ నాయకులు పల్లె ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కిన్నెర యాదయ్య, వాంకుడావత్ రాజ్ కుమార్, ఉప సర్పంచ్ కాటం అంజమ్మ, పల్లే శ్రీను, కామేపల్లి జంగమ్మ, బొడ్డుపల్లి అయోధ్య తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి మధు, నాయకులు గుండెబోయిన శ్రీనివాస్, నామని మోహన్, గిరి, యాదయ్య, బొడ్డుపల్లి వెంకట్, సత్యనారాయణ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పి.లింగయ్య, ఉపాధ్యక్షులు వనం బుచ్చయ్య, కె.నారాయణ రెడ్డి, ఐజాక్, సుగుణయ్య పాల్గొన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎన్వీటీ, ప్రధానకార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణకిషోర్, పిజె.శ్యాంసన్, తాళ్ల సురేష్, క్రాంతి, రాక్ స్టార్ రమేష్ పాల్గొన్నారు.
సీపీఐ ప్రజా భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, పట్టణ కార్యదర్శి జులూరి వెంకట్రాములు, మండల కార్యవర్గ సభ్యులు ఎమ్‌డి. మైనోద్దీన్, నీలా వెంకటయ్య పాల్గొన్నారు.
చిట్యాల : వెలిమినేడు, చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోకల దేవదాసు, 11వ వార్డు కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
అంబేద్కర్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో దాసరి. నర్సింహా, షేపురి యాదయ్య, షేపురి సుదర్శన్, నూనె శ్రీను, తీగల కృష్టయ్య పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని బోయగుబ్బ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గండమల్ల మురళి, గండమల్ల కిరణ్, బాజా నర్సింహా, రెడ్డిమల్ల యాదయ్య, లక్క కృష్ణయ్య, రెడ్డిమల్ల నర్సింహా పాల్గొన్నారు. వట్టిమర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బుర్రి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాగర్ల నరేష్, వార్డు సభ్యులు రాములమ్మ, భీమయ్య, అనూష, మాధవరెడ్డి, గోపాల్, సత్తయ్య పాల్గొన్నారు.
కేతెపల్లి : స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు బోళ్ల నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, చింతపల్లి మారయ్య, కోట లింగయ్య, ఏ.కిరణ్‌కుమార్, ఏ.సుధీర్ పాల్గొన్నారు.
నల్లగొండ : అంబేద్కర్ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మౌనిక, కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి గాదె నర్సింహా, పిచ్చమ్మ పాల్గొన్నారు.
డిండి : కాంగ్రెస్, సీపీఐ, పోలీస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శోభన్‌బాబు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సూదిని వెంకట్‌రెడ్డి, పున్న లింగయ్య, బల్మూరి సాయిబాబు, ఎదుర్ల ఆనంద్, గాయాల తిరుపతయ్య, పున్నా దినేష్, కామాజి చంద్రయ్య, సీపీఐ నాయకులు బొల్లె శైలేష్, కనకాచారి, విధ్యాసాగర్, నిరంజన్, గోవర్ధన్, లింగమయ్య, తవిటి సైదులు పాల్గొన్నారు.
నకిరేకల్ : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, మండల కార్యదర్శి రాచకొండ వెంకట్‌గౌడ్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పనికిర కృష్ణ మోహిని, జిల్లా కమిటీ సభ్యులు ఒంటెపాక కృష్ణ, నాయకులు చెన్నబోయిన నాగమణి, ఒంటెపాక వెంకటేశ్వర్లు, కె.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్‌రెడ్డి, ప్రతినిధులు గంగాధర భద్రయ్య, వీర్లపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.
వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజార్ల శంభయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమారి, అసెంబ్లీ కన్వీనర్ మండల వెంకన్న పాల్గొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోరింకలపల్లి గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, పాలెం గ్రామంలో సర్పంచ్ ఏకుల కవిత విజరు కుమార్, మంగళపల్లి, ఒగోడు, నోముల గ్రామాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
నార్కట్‌పల్లి : స్థానిక బస్ డిపోలో అంబేద్కర్ 130 జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి.కృపాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.రాములు, వి.అనిల్‌కుమార్, మెకానికల్ ఇన్చార్జి వీరాచారి, పి.యాదయ్య, బి.గణేష్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ : హెల్పింగ్ హాండ్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదీహా, యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, సైదా, పాపయ్య, సాయి, జానిభాష, శివ, నవీన్, రోహిత్, నందిని, ఫిరోజా, షాహెదా, ప్రియాంక, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్, ప్రధాన కార్యదర్శి మున్నా, నాయకులు కోదాటి అనిల్, జాస్తీ అమర్, అసిఫ్, భాస్కర్ రెడ్డి, విష్ణు, చింటూ, రాకేష్, సైదులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాస్, చిన్నపొంగు గోపయ్య, కోడిరెక్క మట్టయ్య, బూరుగు వెంకులు, కవి, గాయకులు రావిరాల అంజయ్య పాల్గొన్నారు.
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేశ్, సీఐటీయూ జిల్లా నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు పి.రాంరెడ్డి, బొంగరాల వెంకటయ్య, ఆర్.మంగారెడ్డి, గోవిందరెడ్డి, డాక్టర్ మునీర్ పాల్గొన్నారు.