Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున
నవతెలంగాణ - నల్లగొండ కలెక్టరేట్
సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు వైఎస్ షర్మిలకు లేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష పేరుతో ఆంధ్రప్రాంత వాసి అయిన వైఎస్ షర్మిల దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఉద్యమం చేపడుతుంటే వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేసులు, లాట్టిదెబ్బలతో ఉద్యమాన్ని అనచివేసిన చరిత్ర ఆమె కుటుంబానిదని విమర్శించారు. నిరుద్యోగుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు షర్మిలకు లేదని హెచ్చరించారు, కేసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం లక్షా 32వేల ఉద్యోగాలను భర్తిచేశారన్నారు. అదే విధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం టీఎస్-ఐపాస్ ద్వారా సుమారుగా 14లక్షల మందికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసిఆర్దే అన్నారు. షర్మిల దీక్షకు మద్దతు తెలిపిన నాయకులు నాడు తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడినవరేనని తప్పకుండా తెలంగాణ ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇకనైనా రాష్ట్రంలో షర్మిల డ్రామాలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు పెరిక దివాకర్, జిల్లా నాయకులు బద్రబోయిన సైదులు, షేక్ రషీద్, బకారం నరసింహ, పులకరం వెంకన్న, కొమ్ము లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.