Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ఉపాధి హామీ కూలీలు డబ్బులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్గొండ మండలం జిచెన్నారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీపనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు నెలల నర్సరీ బిల్లులు, గతేడాది నాలుగువారాల కూలిడబ్బులు వెంటనే ఇవ్వాలని, రోజుకూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆ సంఘం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మేట్లు ,కూలీలు అంజయ్య, చంద్రమ్మ, జలందర, సుగుణమ్మ, ప్రమీల, అండాలు ,లక్ష్మి ,చంద్రయ్య, లింగమ్మ, వెంకన్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.