Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారు
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ జిల్లాపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నాడని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సిద్దిపేటకు వందల కోట్లు ఇస్తున్న కెేసీఆర్కు నల్లగొండ జిల్లా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం గుర్రంపోడు మండలంలోని వెంకటాపురం, బుడ్డారెడ్డి గూడెం, కోనాయిగూడెం, బ్రాహ్మణగూడెంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు జానారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం గ్రామాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావని విమర్శించారు. జానారెడ్డి హయంలోనే నాగార్జునసాగర్ అభివృద్ధి చెందింన్నారు. జానారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జెడ్పీటీసీ ఒంగూరి లక్ష్మయ్య ఎంపీపీ మణి మధ్య సుమన్, తదితరులు పాల్గొన్నారు .