Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా రజాకార్లతో పోరాడిన కొండవీటి రామలింగారెడ్డి మృతి బాధాకరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు నమండలంలోని పలివెల గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు అడ్వకేట్ రామలింగారెడ్డి కొంతకాలంగా ఆరోగ్యానికి గురై గురువారం కామినేని ఆస్పత్రిలో మృతిచెందాడు. హైదరాబాదులోని స్వగ్రామమైన అంబర్పేటలో రామలింగారెడ్డి భౌతికకాయానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో భూమి కోసం, భుక్తి కోసం ,విముక్తి సాధన కోసం రజాకార్లతో జరిగిన సాయుధపోరాటంలో పోరాడిన కొండవీటి కుటుంబం చరిత్ర నల్లగొండ జిల్లాలోనే చెదరని ముద్రగా నిలిచిపోతుందన్నారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి , మదర్ డెయిరీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.