Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ఈ నెల 17న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్‌రోజు ఓటువేసేందుకు ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపుకార్డును తెచ్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ఆధార్ కార్డ్, ఉపాధిహామీ జాబ్ కార్డ్, బ్యాంకు పాస్‌బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, స్మార్ట్ కార్డ్,ఇండియన్ పాస్‌పోర్ట్, పొటో గ్రాఫ్‌తో ఉన్న పింఛన్‌్ పత్రం,కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్, లోకల్ బాడీస్, ప్రైవేట్ ఇండిస్టియల్ హౌస్ ఎంప్లాయిస్ సర్వీస్ ఐడెంటి కార్డ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అఫీషియల్ ఐడెంటి కార్డ్ కలిగి ఉండాలని పేర్కొన్నారు.