Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు థర్డ్ ర్యాండ మైజేషన్ నిర్వహించి పోలింగ్ బందాలకు పోలింగ్ స్టేషన్లు కేటాయించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాధారణ పరిశీలకులు సజ్జన్ సింగ్ ఆర్.చవాన్ సమక్షంలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా థర్డ్ ర్యాండ మైజేషన్ నిర్వహించారు. 346 పోలింగ్ బందాలకు నియోజక వర్గ పరిధిలో పోలింగ్ స్టేషన్లు కేటాయించారు. బందాలకు ఈ నెల 16 న అనుముల మండలం ప్రభుత్వ ఐటీఈలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీతో పాటు పోలింగ్ స్టేషన్ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్,డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్స్ అధికారి గణపతి రావు,కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతిలాల్, ఎన్నికల డీటీ విజరు తదితరులు పాల్గొన్నారు.