Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి
- రాష్ట్రంలో జరిగిన అభివద్ధి ప్రతిపక్షాలకు కనిపించ లేదా
- తెలంగాణ వచ్చిన సంతోషం కాంగ్రెస్ నాయకులకు లేదు
- శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
కేసీఆర్ పోరాట పటిమతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివద్ధి పథంలో నడుస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. నాగార్జున సాగర్ లోని బీసీ రెసిడెన్షియల్ స్కూలులో ,డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషకరమైన విషయమన్నారు. ఎన్నో ఏండ్లనుండి సాగర్ ప్రజల కల సాగర్లోని క్వార్టర్స్ని అక్కడి నివాసులకి కేటాయించాలని కలను సభలో కేసీఆర్ క్వార్టర్స్ కేటాయింపు గురించి ప్రస్తావించడం శుభపరిణామని తెలిపారు. నల్గొండ జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామని హామీనిచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ధి ప్రతిపక్షా పార్టీలకు కనిపించడం లేదాఅని ప్రశ్నించారు. జానా రెడ్డి వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జానా రెడ్డి తెలంగాణ కోసం ముఖ్యమంత్రి పదవి అఫర్ని వదులుకున్నారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అసలు జానా రెడ్డికి ఎప్పుడు ముఖ్యమంత్రి ఆఫర్ రాలేదన్నారు. కనీసం టీపీసీసీ అధ్యక్షడిగా కూడా ఆయనకు ఆఫర్ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన బుడ్డరఖాన్ రేవంత్ రెడ్డి ..నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు .తెలంగాణ వచ్చిన సంతోషం, జరుగుతున్న అభివద్ధి, జరగాల్సిన అభివద్ధి పైన కాంగెస్ నాయకులకు సోయి లేదని .అధికారం పోయింది, పదవులు పోయినాయి అనేదే ఎప్పుడు యావ అని విమర్శించారు.రేవంత్ రెడ్డి నోముల నర్సయ్య మీద కపట ప్రేమ వలకబోస్తున్నాడన్నారు. ఆయన కొడుక్కి చివరి నిమిషంలో టికెట్ ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నోముల నర్సయ్యకు 2014లో పార్టీ టికెట్ ఇచ్చింది. 2018 లో కూడా పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి మొదటి నుండి నోముల ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తే టికెట్ ఆశించిన నేతలలో ఎవరితోనైనా తమ పార్టీ నుండి పోటీ చేయించాలనే కుట్రను బీజేసీ చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బలోపేతం చేస్తేనే నాగార్జున సాగర్ అభివద్ధి జరుగుతుందన్నారు. నేను జానా రెడ్డి గారికి పెద్ద కొడుకును, చిన్న కొడుకును అని అని చెప్పుకునే కొందరు కాంగ్రెస్ నేతలు జానా రెడ్డిని ఓడించాలని చూస్తున్నారని తెలిపారు .జానా రెడ్డి గెలిస్తే తమకు పీసీసీ పదవి దక్కదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,రేవంత్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని పేర్కొన్నారు.