Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య
నవతెలంగాణ-మోత్కూరు
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలు కరోనా పట్ల
నిర్లక్ష్యంగా ఉండకుండా నిబంధనలు పాటిస్తూ విధిగా మాస్క్లుధరించాలని చౌటుప్పల్ ఏసీపీ పి.సత్తయ్య అన్నారు. మున్సిపల్ కేంద్రంలో కరోనా నిబంధనలు, మాస్క్‌ల వాడకంపై గురువారం ప్రధాన సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పని చేసే చోట, ప్రజా రవాణా వాహనాల్లో ప్రజలు మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కు ధరించనివారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించనున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 30 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సీఐ సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఐ జి.ఉదరు కిరణ్, ఏఎస్ఏలు యాదయ్య, మోహన్, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, రైటర్ అమత్ తదితరులు పాల్గొన్నారు.