Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ ప్రభుత్వాస్పత్రిలో గురువారం 101 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 32 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.నకిరేకల్ మండలానికి చెందిన వారు 27 మంది ఉండగా ఇతర మండలాలకు చెందిన వారు ఐదుగురు ఉన్నారని వైద్యులు తెలిపారు.
నార్కట్ పల్లిలో 17 కరోనా పాజిటివ్
నార్కట్పల్లి : నార్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గురువారం 103 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ నమోదయినట్లు వైద్యాధికారి పల్లవి పేర్కొన్నారు. నార్కట్ పల్లి ఒకటి, నల్లగొండ 3, ఎల్లారెడ్డిగూడెం 1, నేపీ లింగోటం 4, గోపాలయ పల్లి 1, బ్రాహ్మణ వెల్లంల 1, ఏనుగులదోరి 1, యుఎన్టీపీఎల్ 1కేసులు నమోదైనట్టు తెలిపారు. అదేవిధంగా అక్కినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 69 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 5 పాజిటివ్ నమోదయినట్లు వైద్యాధికారి జమున పేర్కొన్నా రు. చిన్న తుమ్మల గూడెం 1, నక్కలపల్లి 1, మాండ్రా 1, పల్లెపహాడ్ 1, కక్కిరేణి 1 కేసులు నమోదైనట్టు తెలిపారు.
చండూరులో 7 కరోనా కేసులు
చండూరు : మండలంలో 7 కరోనా కేసులు నమోదైనట్టు మండల వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. గురువారం 46 మందికి కరోనా టెస్టులు చేయగా మండల కేంద్రంలో 3, మండల పరిధిలో 4, కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు.
చిట్యాలలో 13 కరోనా పాజిటివ్ కేసులు
చిట్యాల : పట్టణంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 8 మందికి కరొనా టెస్టులు చేయగా ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి కిరణ్ తెలిపారు. వెలిమినెడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో50 మందికి కరోనా టెస్టులు చేయగా 11మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు మెడికల్ అధికారి జయరామ్ తెలిపారు.