Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు అవుతుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. జానారెడ్డి గెలుపు కోరుతూ గురువారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే గొర్రెల్లో ఒక గొర్రె అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జానారెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివద్ధి చెందిందని తెలిపారు .