Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని, కాంట్రాక్టరు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని జన చైతన్య పాదయాత్ర కమిటీ ప్రచార కన్వీనర్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగ స్వామి అన్నారు. గురువారం నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించినట్టు తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో నాసిరకం పనులు జరుగుతున్నాయన్నారు . సిమెంటు ఇసుక ఇటుకతో నిర్మిస్తున్నారన్నారు . చౌడు భూముల్లో నిర్మాణం చేపట్టడంతో మన్నిక ఉండదని చెప్పారు.ఇండ్ల నిర్మాణం ఫై ఉన్నత కమిటీతో విచారణ చేపట్టాలన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మంగా నర్సింహులు ,జిల్లా కమిటీ సభ్యులు అనగంటి వెంకటేశం ,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు , పట్టణ కార్యదర్శి ఎంఎ.ఎక్బాల్ నాయకులు మంగ అరవింద్, చిన్న రాజేష్, యెలుగల శివ ,భువనగిరి గణేశ్, తదితరులు పాల్గొన్నారు