Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
మున్సిపల్ కేంద్రాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా డిమాండ్ చేశారు. గురువారం యాదగిరిగుట్టలో ఏర్పాటుచేసిన జనచైతన్య పాదయాత్ర బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపల్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్కడ ఉపాధిహామీ పనులు లేకుండా చేయడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే అన్ని మున్సిపల్ కేంద్రాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించి రోజుకు రూ.600 వేతనమివ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మర్ అలవెన్స్‌ను వెంటనే ప్రకటించి వారికి పనిప్రదేశాల్లో మంచినీరు, టెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పే స్లిప్స్ ఇవ్వాలని, ఏడాదికిి 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న జరిగే బహిరంగ సభకు ప్రజలందరూ వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారుర. ఈ పాదయాత్ర బందంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ,జిల్లా నాయకులు ధరావత్ రమేష్ నాయక్, మండల కార్యదర్శి. బబ్బురి పోశెట్టి. పెద్ద కందుకూరు సర్పంచ్ భీమ గాని రాములు ,మాజీ సర్పంచ్ మాధవి.జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి,. అనగంటి వెంకటేష్ ,బొడ్డుపల్లి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వనంరాజు , మండల నాయకులు ఎస్కె షరీఫ్. ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే లతీఫ్, తురక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఇమామ్ పాష,. పెద్ద కందుకూరు గ్రామశాఖ కార్యదర్శి కాలేస్వామి, తదితరులు పాల్గొన్నారు.