Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్ఆర్ డెవలపర్స్ వెంచర్ అనుమతులు సక్రమమే
- ఎంపీఓ శ్రీమాళిని
నవ తెలంగాణ-తుర్కపల్లి
తుర్కపల్లి మండల వ్యాప్తంగా 33 వెంచర్లు ఉన్నాయని,వాటిలో16 లీగల్‌గా ఉండగా,17 ఇల్లీగల్‌గా వెలిసాయని వాటిపై నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని ఎంపీిఓ శ్రీమాళిని తెలిపారు. గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో వర్ధన్ డెవలపర్స్ (డీఆర్ఆర్. డెవలపర్స్) వెంచర్‌కు ఎలాంటి అనుమతులు, ఆధారాలు లేవని ఈమధ్య వచ్చిన కొన్ని ఆరోపణలు సరికాదని వెంచర్ అనుమతులకు సంబంధించిన పత్రాలు అన్ని పరిశీలించి పత్రాలు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఈ వెంచర్ లో కొనుగోలు చేసేటటువంటి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వెంకటాపురం సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శులు ఎంపీఓ ప్రకటన చేసిన నేపథ్యంలో అధికారికంగా అన్ని అనుమతులతోనే ఈ వెంచర్ కొనసాగడం మంచి పరిణామమే అని అన్నారు.