Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడ రూరల్
10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న సంఘటన బుధవారం అర్ధరాత్రి మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన పగిడి పర్తి సాంబశివరావు, రామకృష్ణ కలిసి కోదాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ రేటుకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై సైదులు దాడి చేసి బియ్యం తరలిస్తున్న టాటాసుమోను పట్టుకున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై డీటీ విమోచన, ఆర్ఐ ప్రసాద్‌లకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.