Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దామరచర్లలో 9, డిండిలో 11, నూతనకల్‌లో 7 కేసులు నమోదు
నవతెలంగాణ - దామరచర్ల
మండలంలో గురువారం 100 మందికి కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 9 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ఇందులో నర్సాపురం గ్రామానికి చెందిన ఐదుగురికి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు.
కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం పరిశీలన
కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి వహిదా కోరారు. మండలంలోని విష్ణుపురంలో ఉన్న ఇండియా సిమెంట్స్‌లో సాగుతున్న కరోనా టీకాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. అందరూ విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని కోరారు.
డిండి : స్థానిక ప్రభుత్వాస్పత్రిలో గురువారం 59 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 11 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రఘురాంనాయక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.
నూతనకల్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో అలుగునూరు గ్రామంలో గురువారం 262 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు మండల వైద్యాధికారి త్రివేణి తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు.