Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత
నవతెలంగాణ - త్రిపురారం
హాలియాలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, సభకు జనం రాక పోవడంతో టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందని టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన త్రిపురారంలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్లు మొక్కిన వారు ఇప్పుడు ఆయన్ను విమర్శించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. జానారెడ్డిని ఓడించడానికి టీఆర్ఎస్ దండుపాల్యం ముఠాలు రూ.300 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో జానారెడ్డి విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరమల్ల శివ కుమార్‌గౌడ్, ఎస్డి.ఫిరోజ్, సైదులు, నవీన్, ప్రశాంత్, మనీ, శశి, చింటు, వేణు, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.