Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కిసాన్‌సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, సర్పంచ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాస్ అన్నారు. గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని స్థానిక అవంతీపురం మార్కెట్‌యార్డులో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా మార్కెట్ యార్డుకు వరి ధాన్యం వస్తుందని, అయినా రైతులను పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. అట్టహాసంగా ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారే కానీ ధాన్యం కొనుగోళ్లు చేసిన దాఖలాలు మాత్రం లేవన్నారు. అధికారులు సెలవుల పేరిట మార్కెట్ యార్డుకు రాకుండా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రోజుకు ఐదు వేల బస్తాల ధాన్యాన్ని కొనాల్సి ఉండగా కనీసం 500 బస్తాల ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మెన్ రైతులను విస్మరించి సాగర్ ఎన్నికల్లో బిజీబిజీగా గడుపుతున్నారన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో అధికారుల దోపిడీ రాజ్యం నడుస్తోందని, రైతుల వద్ద నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు తీసుకొని వారి వడ్లు ముందుగా కాంటా వేస్తున్నారని, అదే విధంగా టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే, చైర్మెన్ల పైరవీల చేసి వారికి నచ్చిన వారి ధాన్యం ముందుగా కాంట వేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం రాస్తారోకో నిర్వహంచారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, నాయకులు నూకపంగ శ్రీనివాస్, ముచ్చ వెంకన్న, శ్రీనివాస్, జగ్గారెడ్డి, దేవేందర్ రెడ్డి, సుధాకర్, పట్టం శ్రీనివాస్, శంకర్ రెడ్డి, సైదులు తలకొప్పుల, ఇంద్రపల్లి శ్రీను, నరేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలుకూరి బాలు, కౌన్సిలర్స్ దేశిడి శేఖర్ రెడ్డి, కొమ్మన నాగలక్ష్మి, మంత్రాల రుణాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాగిరెడ్డి జగ్గారెడ్డి, సర్పంచులు ముత్యాల వెంకన్న, శ్రీనివాస్, సుధాకర్, ఎంపీటీసీలు బెజ్జం సాయి, దేవేందర్ రెడ్డి, పట్టం శ్రీనివాస్, సైదులు, బొడ్డు నరేష్, తలకొప్పుల సైదులు, ఇంద్ర పల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు సారెడ్డి శంకర్ రెడ్డి, బూడిద సైదులు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.