Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ మన్నె రేణుక అన్నారు. గురువారం మండల పరిధిలోని కాసర్లపహాడ్, కుంచమర్తి, ఉయ్యాలవాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందన్నారు. వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు దళారులను ఆశ్రయించి మోస పోకుండా ధాన్యాన్ని నేరుగా ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసర్లపహాడ్ గ్రామ సర్పంచ్ దబ్బేటి జ్యోతిరాణి, కుంచమర్తి గ్రామ సర్పంచ్ ఉగ్గం ఉపేంద్ర, ఉయ్యాలవాడ గ్రామ సర్పంచ్ సాగర్ల బుచ్చయ్య, ఎంపీటీసీ బొడ్డు భద్రమ్మ, ఏపీఎం ఇద్దయ్య, ఏఈవో సత్యం, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, లింగరాజు, స్రవంతి, నల్లు సోమిరెడ్డి, ముత్తయ్య, తిరుపతయ్య, లింగమల్లు, శ్రీను, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ కంకణాల ప్రవీణవెంకట్‌రెడ్డి కోరారు. గురువారం మండలంలోని కురుమేడు ఎక్స్ రోడ్డు వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ లింగంపల్లి వెంకటయ్య, స్థానిక ఎంపీటీసీ కుంభం శ్వేత శ్రీశైలం గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు అండేకార్ అశోక్, ఈరటి మల్లేష్ యాదవ్, గ్రామస్తులు కుంభం శ్రీశైలం గౌడ్, రాటకొండ నరేంద్ర ప్రసాద్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట : ధాన్యం అమ్మకాలు జరిపే ముందు రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 4,5,6,18 వార్డుల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మిమకట్ లాల్, మాలోతు కమల చంద్రునాయక్, లింగానాయక్, టీఆర్ఎస్ నాయకులు సునీల్‌రెడ్డి, భీమానాయక్, సత్తిరెడ్డి, బద్రునాయక్, సోమయ్య, సైదులు, కమలాకర్, శ్రీకాంత్, బలరాం, సక్రునాయక్, రమాకిరణ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
నాగారం : మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎంపీపీ కూరము మనీ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యరల నర్సింహారెడ్డి, ఏపీఎం నాగేశ్వర్, వీబీకే రాణి, సంపెట కాశయ్య, దేవరకొండ యాదగిరి, కొండ మల్లేష్ తదితరులు పాల్గొ న్నారు.
పాలకవీడు : స్థానిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహి స్తోన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీ ఎస్ చైర్మెన్ వై.సత్యనారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో, అలింగాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 3600 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
నార్కట్‌పల్లి : రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని సెర్ఫ్ ఏపీఎం ఓగోటి కృష్ణ కోరారు. గురువారం మండలంలోని ఔరవాణి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ గ్రామ ఎంపీటీసీ శ్రీరామోజు విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యంలో తేమ, తాలు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీరామోజు వెంకటేశ్వర్లు, మాదగోని నర్సింహా, బైరు కృష్ణయ్య, వేణుగోపాల్‌రెడ్డి, కాలం రవీందర్‌రెడ్డి, సీసీ రమాదేవి, వీవోలు రేణుక, గీత, వినోద తదితరులు పాల్గొన్నారు.