Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - నాగార్జున సాగర్
నాగార్జున సాగర్ నియోజక వర్గానికి జానారెడ్డి చేసిందేమీ లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారుర. మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. మున్సిపాలిటీలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఎవరైతే నివాసముంటున్నారో వారికే నోముల భగత్ గెలిచిన సంవత్సరంలోపు కేటాయిస్తామన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన జానారెడ్డికి నాగార్జునసాగర్ అభివృద్ధి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివద్ధి చేయలేని వ్యక్తి ఇప్పుడు ఎలా చేస్తాడో ప్రజలకు వివరించాలన్నారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండి పోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్‌తో ఈ ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, జీవీ రామకృష్ణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, బషీర్, కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ, రమేష్‌జీ, మంగ్తనాయక్, ఆదాసు నాగరాణి, నాగ శిరీష మోహన్‌నాయక్, నిమ్మల ఇందిర, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బత్తుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.